పోలింగ్ సమయం గంట పాటు పొడగింపు: కలెక్టర్

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్గొండ పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ సమయాన్ని  గంట పాటు పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్  ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. లోక సభ ఎన్నికల పోలింగ్ ను  ఈ నెల 13 న  ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సిందిగా గతంలో ఎన్నికల సంఘం ఆదేశించిందని, అయితే ఎండల తీవ్రత దృష్ట్యా  పోలింగ్ సమయాన్ని మరో గంట పోడగించాల్సిందిగా రాజకీయ పార్టీలు కోరిన నేపథ్యంలో వారి విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నల్గొండ జిల్లాలోని పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.   అందువల్ల లోక సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు,  ముఖ్యం గా జిల్లా  ఓటర్లు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి మే 13 న  ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే పోలింగ్ లో ఓటర్లందరూ పెద్ద ఎత్తున  పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆమె కోరారు.