నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆదిశగా మహిళా శిశు సంక్షేమ అధికారులు తమవంతు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల శాఖ పై జిల్లా అధికారి, సంబంధిత సిడిపివోలు, సఖి సెంటర్ సిబ్బంది, ఐసీపీస్ , బి ఆర్ బి కోఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు, గర్భిణీ అలాగే బాలింతలకు అందిస్తున్న సేవలు గురించి తెలుసుకున్నారు. జిల్లాలోని మహిళలకు సంబంధించిన సఖి సెంటర్ , మహిళా సాధికారత కేంద్రం, బాలరక్ష, వికలాంగుల వయోవృద్ధుల విభాగాలపై సమీక్ష నిర్వహించారు. మహిళ సాధికారత, సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వి.వెంకటరమణ, సిడిపిఓలు,పారిజాత, కిరణ్మయి, శ్రీవాణి,రూప,హేమదేవి, శ్రీజ, డిసిపివో రవి,ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ వినోద్ కుమార్ , సఖి అడ్మిన్ హేమలత, సంకల్ప్ జిల్లా కోఆర్డినేటర్ చైతన్య తడిటరుకు పాల్గొన్నారు.