ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను పరిశీలించిన కలెక్టర్

నవతెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు అందుతున్న ఎనిమిది రకాల వైద్య సేవలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య సేవలు అందిస్తున్న తీరును మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంతృప్తిని వ్యక్తం చేశారు.