
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర జరిగే మేడారం గ్రామంలో నూతన ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటుకు స్థలాన్ని బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలోని పోలీస్ కోటర్స్ పక్కన, సులబ్ కాంప్లెక్స్ వద్ద, స్థలాన్ని ఆర్డీవో సత్యపాల్, స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, ఎండోమెంట్ ఈఓ రాజేంద్రం, ఎయిర్టెల్ సంస్థ ప్రతినిధులతో చర్చించి పరిశీలించారు. అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర ప్రాంతమైన మేడారం భక్తులకు, స్థానికులకు ఎయిర్టెల్ సెల్ టవర్ లేనందున నాన్న ఇబ్బందులు పడుతుండడంతో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక శ్రద్ధతో సెల్ టవర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఫిబ్రవరిలో జరుగు మేడారం మహా జాతరకు ఎయిర్టెల్ సెల్ సేవలు అందుబాటులో ఉండాలని ఎయిర్టెల్ ప్రతినిధులతో మాట్లాడారు. ఆమె వెంట ఆర్డిఓ సత్యపాల్, స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్, మేడారం ఈవో రాజేంద్రం, ఎయిర్టెల్ ఏరియా ఆపరేషన్ మేనేజర్ సుగుణాకర్ రెడ్డి, ఎయిర్టెల్ ఆర్ యఫ్ లీడ్ కార్తిక్ రెడ్డి, ఎయిర్టెల్ సైడ్ డిక్లరేషన్ లీడ్ రమేష్ బాబు, ఆర్ఐ సునీల్, ఎండోమెంట్ అధికారులు, పూజారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.