దెబ్బతిన్న వంతెన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని రాఘవపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న వరదల వల్ల దెబ్బతిన్న వంతెనను సమీప ప్రాంతాలను బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తహసిల్దార్ అల్లం రాజకుమార్ లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా రహదారి మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారని స్థానికులు అన్నారు. రాఘవపట్నం గ్రామం నుండి మేడారం వెళ్లే రహదారికి కలిసే మార్గం మద్యంలో వంతెన ప్రాంతంలో లోతైన గొయ్యి ఏర్పడింది ఆ ప్రాంతంలో అనేక ఎకరాలు ఇసుక మేటలు పెట్టాయని గ్రామస్తులు అధికారులకు వివరించారు.