అటవీ క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్..

The collector inspected the forest field.నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్య అటవీ క్షేత్రాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఆదివారం  ఆయన జన్నారం మండలంలోని గోండుగూడా అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా అడవి, వన్యప్రాణుల రక్షణకు అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. అలాగే అటవీ అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.