– మరుగుదొడ్ల వద్ద చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని పలు గ్రామాలలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ పాఠశాలలను పరిశీలించారు. మండలంలోని అర్గుల్ ,లక్ష్మాపూర్ గ్రామాల పాఠశాలలొ జరుగుతున్న మరమ్మత్తు పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మరుగుదొడ్ల వద్ద చెత్తాచెదారం లేకుండా చేయాలని పాములు రాకుండా చూడాలని డిఇఓ దుర్గాప్రసాద్ ఆదేశించారు. మరుగుదొడ్ల వద్ద పరిశుభ్రంగా ఉంచాలని డిపిఓ కు ఆదేశాలు జారీచేస్తామన్నారు. జూన్ 12 కల్లా పాఠశాలలోని మరమత్తు పనులను విద్యుత్ సౌకర్యము మౌలిక సదుపాయాలు అన్ని కల్పించాలని ఉపాధ్యాయులకు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఆయన వెంట దుర్గ ప్రసాద్, ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, తాసిల్దార్ కిరణ్ మై, ఎంఈఓ శ్రీనివాస్, మండల సూపర్డెంట్ బ్రహ్మానందం, ఎంపీ ఓ యూసుఫ్ ఖాన్, స్థానిక ప్రజలు ఉపాధ్యాయులు,ఐకేపీ ఏపీఎం రవీందర్ రెడ్డి, ఐకెపి కమ్యూనిటీ కోఆర్డినేటర్ లు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు వివో ఎలు, తదితరులు పాల్గొన్నారు.