స్పెషల్ డ్రైవ్ లో ఎంప్లాయ్ మెంట్ కార్డుల జారీ: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ నియోజక వర్గాల నిరుద్యోగ యువతి యువకులకు ప్రతినెల మొదటి వారం బుధ,గురు,శుక్ర, వారాలలో హుజూర్నగర్ ఆర్డిఓ ఆఫీస్ యందు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన వారికి స్పెషల్ డ్రైవ్ లో కొత్త ఎంప్లాయిమెంట్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంప్లాయిమెంట్ కార్డుల కొరకు కావాల్సిన విద్యా అర్హత ఒరిజినల్ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఫోటో తీసుకొని ఆర్డిఓ ఆఫీస్ లో హాజరు కాగలరని తెలిపారు.వెబ్సైట్ www.employment.telangana.gov.in లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఇతర  వివరాల కొరకు 9030206741 నంబర్ కు సంప్రదించగలరని తెలిపారు.