పోలింగ్ స్టేషన్ను పరిశీలిస్తున్న కలెక్టర్ జితేష్ వి పాటిల్

– ఓటర్స్ ఎన్రోల్మెంట్ సక్రమంగా నిర్వహించాలి
నవతెలంగాణ – తాడ్వాయి 
ఓటర్స్ ఎన్రోల్మెంట్ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు తాడ్వాయి మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బి ఎల్ ఓ లు అర్హులైన ఓటర్స్ జాబితా సేకరించాలని సూచించారు. అందరు  బి ఎల్ వో లు సక్రమంగా విధులు నిర్వహించాలని కోరారు. పోలింగ్ బూత్ లో సౌకర్యాలు ఉన్నాయా లేదా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు బ్రాహ్మణపల్లిలో పోలింగ్ బూత్ ను ఎల్లారెడ్డి ఆర్ డి ఓ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సునీత డిటి వెంకటేష్ ఆర్ ఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.