నవ తెలంగాణ-రామారెడ్డి
దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలని రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని అన్నారం గ్రామంలో దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఏడిఏ రత్న, తహశీల్దార్ ఆనంద్, ఏవో హరీష్ కుమార్, ఎంపీవో సవిత, సర్పంచ్ అమృత బాలరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ చంద్రకళ గంగారెడ్డి, సోసైటీ డైరెక్టర్ స్వామిగౌడ్, ఆసరి కిషన్, సాయిరాం గౌడ్, సతీష్ గౌడ్,కార్తీక్, తదితరులు ఉన్నారు.