హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు కేంద్రాలను పర్యటకంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. శుక్రవారం హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో నియోజకవర్గం అభివృద్ధిపై మంత్రిత్వ ప్భాకర్ ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంతోపాటు వివిధ ప్రాంతాలను పర్యటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే గౌరవెల్లి దేవాదుల ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీటి అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖల ద్వారా పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి పోన్నం ప్రభాకర్ సూచనలు మేరకు నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు.
ల్యాండ్ బ్యాంకింగ్ ,ప్రాజెక్టుల భూ సేకరణ సత్వరమే పూర్తి చేస్తాం: కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
చిగురుమామిడి సైదాపూర్ మండలాల్లో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వాయిపేట, రాయికల్ జలపాతం టూరిజం స్పాట్ గా మార్చేందుకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేస్తామని తెలిపారు. రైతు వేదికల ద్వారా రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు శివశక్తి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు పెండింగ్ పనులను సత్వరమే పూర్తయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన రూట్ మ్యాప్ ను తయారు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల వివరాలతో ల్యాండ్ బ్యాంకు తయారుచేసి భూములు కబ్జా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో చర్చించిన అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు.