ధరణి దరఖాస్తుల పరిష్కారంలో జాగ్రత్తలు అవసరం: కలెక్టర్

– ప్రతిరోజు మండలాల వారీగా ఫైళ్ళ తనీఖీ
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో తప్పులు చేయకుండా జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తహసిల్దారులను ఆదేశించారు.ధరణి దరఖాస్తుల పరిష్కారం పై బుధవారం ఆయన టెలికా న్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి దరఖాస్తుకు  ఆర్ ఎస్ ఆర్ ను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎక్కడైనా కుటుంబ తగాదాలకు సంబంధించి  సమస్య వచ్చిన ట్లయితే తప్పనిసరిగా ఆధారాలతో సహా నమోదు చేయాలని చెప్పారు.  ప్రజావాణి కార్యక్రమంలో భూములకు సంబం ధించి వచ్చిన దరఖాస్తులు వచ్చే శనివారం నాటికి పరిష్క రించాల్సిందిగా ఆదే శించారు. సర్వే కి సంబంధించి ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేకంగా వేరు చేసి సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ తో ,  రెవెన్యూ అసనపు కలెక్టర్ ద్వారా 15 రోజుల్లో వాటిని పరిష్కరిం చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ధరణి దరఖాస్తులకు సంబంధించి ప్రతిరోజు కొన్ని మండలాల వారిగా ఫైళ్లను తనిఖీ జరుగుతున్నదని, ఇప్పటివరకు 2 డివిషన్ల లోని ఆయా మండలాల వారిగా ఫైళ్ళు తనిఖీ చేయడం పూర్తయిందని, తక్కిన డివిజన్లలో  సైతం అదే విధంగా పరిశీలించడం జరుగు తుందని, ఆ విధంగా తహసి ల్దారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా  ధరణి దరఖాస్తుల పరిష్కారం పై మండ లాల వారిగా తీసుకుంటున్న చర్య లను రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ జిల్లా కలెక్టర్  కు వివరించారు.ఈ వీడి యో కాన్ఫరెన్స్ కు ఆర్డీవోలు, తహ సిల్దార్లు హాజరయ్యారు.