నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఈ సంవత్సరం యాసంగి ధాన్యం కొనుగోలు లో భాగంగా నల్గొండ జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు 517 కోట్ల రూపాయలను చెల్లించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు గాను 370 దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, వీటి ద్వారా ఇప్పటివరకు 631 కోట్ల రూపాయల విలువచేసే రెండు లక్షల 86,565 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 45,598 మంది రైతుల ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు ధాన్యం అమ్మిన 36వేల 928 మంది రైతులకు 517 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని, తక్కిన 117 కోట్ల రూపాయల ను త్వరలోనే చెల్లించనున్నట్లు ఆయన వెల్లడించారు.