కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

Collector Rahul Sharma inspected the purchase centersనవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ గురువారం మండలంలోని తాడిచర్ల, పెద్ద తుండ్ల గ్రామాల్లో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాణ్యత గల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచకుండా ట్యాగ్ చేసిన మిల్లులకు వెంటనే రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు.17 శాతం తేమ ఉంటే జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు.  ఈ సందర్భంగా తేమ శాతాన్ని పరిశీలించి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.  తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆదేశించారు.ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి రూ.500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు.  సన్న, దొడ్డు రకం కేంద్రాలు విడివిడిగా ఉండాలని, కలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఎంపిడిఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ తనిఖీ చేశారు.. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. డేటా సిబ్బందిని రోజుకు ఎన్ని ఫారాలు ఆన్లైన్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సర్వే సమగ్ర సమాచారం పూర్తిగా గోప్యతగా ఉంచాలని బయటికి వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతర్జాతీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.తదుపరి  గ్రంధాలయ భవనం, సహకార సంఘ భవనాలను  పరిశీలించి, పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, తహసీల్దార్ రవి కుమార్, ఎంపిడిఓ శ్యాం సుందర్, పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప. మొండయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, సీఈఓ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.