టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శాఖపై కలెక్టర్ సమీక్ష

– పలు అంశాలపై డీడీ, ఏడీతో చర్చ
నవతెలంగాణ – సిరిసిల్ల
టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ శాఖపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా  బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డీడీ, ఏడీతో కలెక్టర్  చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలో పవర్ లూమ్స్ ఎన్ని ఉన్నాయి? నేత కార్మికులు ఎందరు ఉన్నారు? పవర్ లూమ్ పరిశ్రమ ద్వారా ఎంత మంది ఉపాధి పొందుతున్నారు? తదితర విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నేత కార్మికులకు ఏ ఏ పథకాలు అమలు అవుతున్నాయి? జిల్లాలో ఉన్న టెక్స్టైల్ పార్క్, అపెరల్ పార్క్, ఇంకా ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టీఎస్ఐఐసీ బాధ్యులతో సమీక్షించారు. సమావేశంలో టెక్స్ టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డీడీ అశోక్ రావు, ఏడీ సాగర్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.