
లోక్ సభ సాధారణ ఎన్నికలలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికలకు నియమించబడిన నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోడల్ అధికారులందరూ వారికి కేటాయించిన విధులను, బాధ్యతలను ఎన్నికల నిబంధన ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 18 మంది జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా యంసిసి నోడల్ అధికారిగా సతీష్ కుమార్, మాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా జడ్పీ సీఈఓ అప్పారావు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్గా జి శ్రీధర్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి, నోడల్ ఆఫీసర్ ఫర్ స్వీప్ జిల్లా విద్యాశాఖ అధికారి కే అశోక్, లా అండ్ ఆర్డర్ నోడల్ ఆఫీసర్గా అడిషనల్ ఎస్పీ ఎం నాగేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ ఈవీఎం మేనేజ్మెంట్ పి రాములు సివిల్ సప్లై డిఎం, నోడల్ ఆఫీసర్ ఫర్ కమ్యూనికేషన్ ప్లాన్ వెబ్ కాస్టింగ్ కే సురేష్ కుమార్ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ ఫర్ అబ్జర్వర్స్ ఆర్ లంసా నాయక్ డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ గా నియమించడం జరిగిందన్నారు. ఎవరికి కేటాయించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్, దివ్యంగా ఓటర్లు, హోం ఓటింగ్ విధానం బాగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఓటు ప్రాధాన్యత ఓటు హక్కు పై కళాశాలలో ఉన్నత విద్యాసంస్థలలో స్వీప్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్వీట్ నోడల్ ఆఫీసర్ అశోక్ కుమార్కు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, సి- విజిల్, ఫిర్యాదుల స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్ అలాగే పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పలు అంశాలపై నియమింపబడిన నోడల్ అధికారులు వారి విధులు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఈవీఎంస్,కర్చుల నమోదు వివరాల గురించి విప్పర్ల రమేష్ వివరించారు,పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు , స్విప్,మాన్ పవర్ పై వేంకటేశ్వర్లు,పోస్టల్ ఓటింగ్, పోలింగ్ మేనేజ్మెంట్,రవాణా పై శ్రీనివాసరావు పిపిటి ద్వారా నోడల్ ఆదికారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ట్రైనింగ్ మేనేజ్మెంట్ న్యూ మోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి మాస్టర్ ట్రైనర్లు విప్పర్ల రమేష్,వెంకటేశ్వర్లు,శ్రీనివాసరావు,నోడల్అదికారులు,పాల్గొన్నారు.