బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా ఆదివారం ఉద్యోగ బాధ్యతలు ఆదివారం స్వీకరించారు. అంతకుముందు ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళగా, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్, ఆలయ ఇంచార్జీ ఈఓ రామకృష్ణ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. అక్కడి నుంచి కలెక్టర్ నేరుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ కు చేరుకొని బాధ్యతలు స్వీకరించగా, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ పుష్ప గుచ్చం అందజేశారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్ ను కలిసి పూల మొక్కలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.