– ఈచ్ వన్.. సేవ్ వన్
నవతెలంగాణ – సిరిసిల్ల
సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్)పై అందరికీ అవగాహన ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సీపీఆర్ పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని శనివారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, వైద్యులకు నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. సీపీఆర్ పై అవగాహనతో విలువైన ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ స్వయంగా సిపిఆర్ చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందరికీ సిపిఆర్ ప్రక్రియ పై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఒక వ్యక్తికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు అయినప్పుడు వారికి సి పి ఆర్ చేసినట్లయితే వారిని ప్రమాదం నుండి కాపాడగలుగుతామని అన్నారు. ఇది లేకపోవడం వలన మరణాలు సంభవిస్తున్నాయి, అందువలన సి.పి.ఆర్ ట్రైనింగ్ సడన్ కార్డియాక్ అరెస్టు అయినప్పుడు ప్రథమ చికిత్స అందించాలన్నారు. దీనికై ప్రతి ఉద్యోగికి ఈ శిక్షణ అవసరం ఉందని తద్వారా ప్రాణాలు కాపాడవచ్చు అని తెలిపారు.కార్డియాక్ అరెస్టు అయిన వారికి వెంటనే సి పి ఆర్ చేస్తూ, 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడొచ్చని అన్నారు. ఈ దిశగా ప్రతి మండల కేంద్రంలోని ప్రజలకు, సిబ్బంది, అధికారులకు శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంత రావు, ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. సి పి ఆర్ కార్డియో పల్మనరీ రీసోసియేషన్ అనేది సడన్ కార్డియాక్ అరెస్టు, స్పందనలో కీలకమైనదని,గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, మెదడు మరియు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం లేదా మరణం నిమిషాల్లో సంభవిస్తుందని తెలిపారు.సిపిఆర్ అనేది అత్యవసర వైద్య సేవలు వచ్చేవరకు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని అందించడంలో సహాయపడే రక్షక సాంకేతికత యొక్క లక్ష్యం చాతి నొక్కడం మరియు రెస్కు శ్వాసలను అందించడం ద్వారా శరీరమంతా ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని అందిస్తుందని ఇది మెదడు మరియు ఇతర అవయవాలకు ఆక్సిజన్ అందించడంలో సహాయపడుతుందని, నష్ట తీవ్రతను తగ్గిస్తుందని, బ్రతికే అవకాశాలను పెంచుతుందని తెలిపారు. జీవించి ఉన్న లక్షణాలు కనిపించని వ్యక్తులపై సి.పి.ఆర్. చేయబడుతుంది.జీవించి ఉన్న లక్షణాలు కనిపించని బాధితుడిని సిపిఆర్ చేస్తే వారి జీవితాన్ని రక్షించగలం. జీవించి ఉన్న సంకేతాలు లేవని నిర్ధారించిన తర్వాత మీరు చాతి నొక్కడం ద్వారా గుండె నుండి శరీర భాగాలకు రక్తప్రసరణ అందించడం, హెడ్ టిల్ట్ చిన్ను లిఫ్ట్ నైపుణ్యం ద్వారా వాయు మార్గాన్ని తెరవడం శ్వాస కోసం తనిఖీ చేయడం, కృత్రిమ శ్వాసను కల్పించడం, సిపిఆర్ విషయంలో 30 సార్లు చాతినొక్కడం మరియు రెండు వెంటిలేషన్ తో చేయడం జరుగుతుందని శిక్షకులకు పవర్ ప్లాంటేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజగోపాల్, ప్రోగ్రాం ఆఫీసర్ ఉమాదేవి, వైద్యులు, జిల్లా అధికారులు, ఇతర శాఖల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.