– ఫెసిలిటేషన్ సెంటర్లలో చేసిన ఏర్పాట్లకు ఉద్యోగుల అభినందనలు
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభా ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కై ఫెసిలిటేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు. శనివారం స్థానిక ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాలలో సూర్యాపేట నియోజక వర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులు అలాగే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగానికై ఏర్పాటు చేసిన పేసిలిటేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజక కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకై పి.ఓ, ఏ.పి.ఓ లకు మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.అయో నియోజక పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఈ నెల 3 నుండి 8 వరకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తమ పోస్టల్ బ్యాలెట్ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఇప్పటి వరకు దాదాపు 275 వరకు ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు.అదేవిదంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల శిక్షణా తరగతులు హాజరు కానీ సిబ్బందికి చివరి అవకాశంగా ఈ నెల 7 న ఉదయం 10 గంటలకు ఎస్.వి ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణకు హాజరు కావాలని లేనియెడల ఎన్నికల నిబంధనల మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఏఆర్ఒలు వారిదగ్గరకూడ శిక్షణ కు రాని వారిపై కూడ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఫెసిలిటేషన్ సెంటర్లో ఎన్నికల సిబ్బంది కొరకు ఉద్యోగులకు చేసిన ఏర్పాట్ల పట్ల సూర్యపేట ఆర్డీవో ను తాసిల్దార్ చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వేణుమాదవ రావు ,తహశీల్దార్లు సూర్యాపేట శ్యామ్ సుందర్ రెడ్డి, చివ్వేంల కృష్ణయ్య, పెన్ పహాడ్ మహీందర్ రెడ్డి ఎన్నికల విభాగం సిబ్బంది , ఎస్.ఎల్.ఎం.టి లు తదితరులు పాల్గొన్నారు.