నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యార్థినిలు మంచి ఆరోగ్యంతో ఉండి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం మండలంలోని చలువాయి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ ఏం వెంకటలక్ష్మి అధ్యక్షతన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సానిటరీ నాప్కిన్స్ మిషన్ ను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థినిలు సానిటరీ నాప్కిన్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చుట్టూ పరిశుభ్రతతో పౌష్టికాహారం తీసుకుంటూ మంచి ఆరోగ్యంతో చక్కటి చదువులు చదివి రాణించాలని అన్నారు. జిల్లా విద్యాధికారి పాణి ని మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించి, జాగ్రత్తలు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జి సి డి ఓ రమాదేవి, ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సర్పంచి ఈసం సమ్మయ్య, మండల విద్యాధికారి గొంధి దివాకర్, తాహసిల్దార్ అల్లం రాజకుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, డిపిఓ వెంకయ్య, బి డబ్ల్యు ఓ ములుగు తదితరులు పాల్గొన్నారు.