పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్

నవతెలంగాణ – బొమ్మలరామరం 
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే అన్నారు. మండలంలోని గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి దరఖాస్తుల పరిష్కార పనులను పరిశీలించారు. పారదర్శకతతో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ధరణి దరఖాస్తులను సరిచేయాలని, పెండింగ్ లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా వేగవంతంగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పి.శ్రీనివాస్,సీనియర్ అసిస్టెంట్  విజయ రామారావు, కంప్యూటర్ ఆపరేటర్ బాలు సిబ్బంది పాల్గొన్నారు.