
అమ్మ ఆదర్శ పాఠశాల లో పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. గురువారం డి ఈ వో ఎంఈఓ లు హెచ్ఎంలు కాంప్లెక్స్ హెచ్ఎంలు నోడల్ ఆఫీసర్లతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ బూతులు ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పోలింగ్ తేది లోపున పూర్తి చెయాలని, పాఠశాలల యొక్క కరెంటు బిల్లులను పాఠశాలల నిధుల ద్వారా చెల్లించాలని కలెక్టర్ తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను త్వరగా పూర్తి చేయాలని పోలింగ్ బూతులు ఉన్న పాఠశాలలో రాంపులు, కరెంటు ,టాయిలెట్స్ వంటి వాటిని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎంఈఓ లు పాఠశాలల హెచ్ఎంలు పిల్లలకు అత్యవసరమైన చిన్నచిన్న పలులు పూర్తి అయ్యే విధంగా చూసుకోవాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరివేక్షించి కావాల్సిన అత్యవసరమైన పనులను త్వరగా పూర్తి అయ్యేలా కమిటీలతో చర్యలు తీసుకోవాలన్నారు.హెచ్ ఎం మొబైల్ యాప్ లో అమ్మ ఆదర్శ పాఠశాల యాప్ ను డౌన్లోడ్ చేసుకొని పనిలోయొక్క పురోగతిని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని అలాగే ప్రతిరోజు ఫోటోలను కూడా యాప్ నందు పెట్టాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు 23వ తేదీ నుండి సెలవులు కావున పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలల యొక్క తాళాలను పంచాయతీ సెక్రెటరీలకు అందజేయాలని హెచ్ఎం లకు కలెక్టర్ తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో డిఇఓ అశోక్ కుమార్ ,హేచ్ఎంలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.