రోడ్ల పనులను నాణ్యత లోపాలు లేకుండా నిర్మించాలి: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రోడ్ల పనులను నాణ్యత ప్రమాణాలతో ప్రజావసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మాణాలు చేపట్టే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టే క్రమంలో సంబంధిత శాఖ ఇంజనీర్లు మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో రోడ్ల నిర్మాణ కు సహకరించాలని కొన్నిచోట్ల నీటి సరఫరా పాత పైపులైన్లు పరిశీలించాలని, కాల పరిమితి ఆయనచో వాటి స్థానంలో రోడ్లకు ఇరువైపులా ముందస్తుగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి నేటి సరఫరా పైపులైన్లు నిర్మాణం చేపట్టాలని వాటి అంచనా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలోని రోడ్లన్నీ టెండర్లు పూర్తయ్యాయని ఈఈ సీతారామయ్య  కలెక్టర్కు వివరించారు. గడేపల్లి టు జాన్పాడు రోడ్, అనంతగిరి టు చాన్పల్లి, దొండపాడు ఎన్హెచ్ 9 పనులు పూర్తయ్యాయని టెండర్లు పూర్తయిన పనులన్నీ 24 నుండి పనులు మొదలు పెడతామని తెలిపారు. కొన్నిచోట్ల ఎలక్ట్రికల్ స్తంభాలు షిఫ్ట్టింగ్ జరుగుతుందని అది పూర్తయిన వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం చేపడతామని ఈఈ పేర్కొన్నారు సూర్యాపేట పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కొరకు స్థల పరిశీలన చేయాలని కలెక్టర్ ఈఈకి ఆదేశించారు. మంజూరైన పనులు చేపట్టడంలో జాప్యం ఉండకూడదని రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన సిసి రోడ్లు ట్రైన్లు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద చేపట్టిన రోడ్లన్నీ మార్చి 30 ఒకటో తేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన ఆయుష్ బిల్డింగులని ఏప్రిల్ మొదటి వారంలో పూర్తయ్యేటట్లుగా పనులు జరగాలన్నారు. మండలాల్లోని అన్ని పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం మార్చి రెండో వారంలో పూర్తి చేయాలన్నారు. ఎమ్మార్ఆర్,సి ఆర్ ఆర్ కింద చేపట్టిన పనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలి ఉన్న 2 బిహెచ్ కె పనులు త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఎస్సీ ప్రకాష్ ,ఈఈ వెంకటయ్య,ఈ ఈ ఆర్ అండ్ బి సీతారామయ్య, డి ఈ పవన్, మిషన్ భగీరథ ఇంజనీర్లు అరుణ్ కుమార్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.