
నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రధానంగా వేసవికాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు జిల్లా కలెక్టర్ ములుగు ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో త్రాగునీరు సరఫరాపై మండల స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించనైనది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వారీగా త్రాగునీరు సమస్యలపై ఆరా తీయడం జరిగిందని అన్నారు. ఈ వేసవి కాలము ఏప్రిల్,మే-2024 మాసంలలో ఎలాంటి మంచినీరు సమస్యలు రాకుండా చూడాలని గ్రామ ప్రత్యేక అధికారులను కార్యదర్శులను ఆదేశించినారు అన్ని ఆబిటేషన్లలో కూడా మంచినీరు సరఫరా సరిగ్గా జరగాలని సూచించారు. అందుబాటులో ఉన్నటువంటి 15 ఫైనాన్స్ ఫండ్ ను త్రాగునీరు సమస్యలకు వినియోగించాలన్నారు చేతిపంపులు వినియోగంలోకి వచ్చే విధంగా చూడాలన్నారు ఎక్కడ కూడా మరమ్మతులు లేకుండా చేతి పంపులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందస్తుగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించినారు ఎక్కడైనా ఏమైనా మేజర్ సమస్యలు తలెత్తినచో తన దృష్టికి తీసుకురావాలని తెలిపినారు చివరగా హాజరైన వారందరికీ సేవ్ వాటర్ కాన్సెప్ట్ తో క్యాప్స్ ( టోపీలు)ఇచ్చి ధరింపజేసినారు. ఈ సమావేశంలో కే మల్లేష్ సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ మిషన్ భగీరథ, సిహెచ్ సుభాష్ ఈఈఎంబి ఇంట్రా, ఎంపీడీవో జి జవహర్ రెడ్డి, తాసిల్దార్ సృజన్ కుమార్,డిఎల్పి ఓ స్వరూప రాణి,ఎంపీ ఓ సాజి దా బేగం,మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ చంద్రకాంత్, సిహెచ్ మధు మరియు అన్ని గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు హాజరైనారు మరియు ఇతర శాఖల అధికారులు హాజరైనారు.