నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రభుత్వ డాక్టర్ల కు సూచించారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న పానగల్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని మందులను, అటెండెన్స్ రిజిస్టర్ ను, సౌకర్యాలను, ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్, వార్డులను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి ముందు ఓపెన్ డ్రైనేజ్ వల్ల వర్షాకాలంలో నీరు చేరి ఆసుపత్రి లో ఇబ్బంది కలుగుతున్నదని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, తక్షణమే చర్యలు తీసుకొని నీరు చెరకుండా చూడాలని మున్సి పల్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని అన్నారు.ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీ తో మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని? ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అని అడిగారు. జాగ్రత్తగా మందులు వాడాలని పౌష్టికాహారం తీసుకోవాలని ఆమెకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని, అలాగే ప్రతి గర్భిణీ స్త్రీ నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో గత రెండు రోజులుగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఆసుపత్రి పరిసరాల్లో చెత్తా చెదారాన్ని తీసివేయడం, ముళ్ళ పోదలను తొలగించడం, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, ఆసుపత్రి వైద్యాధికారి రూపిక, కో-ఆర్డినేటర్ బిక్షం తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.