మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాల పరిసరాలను, ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ బుధవారం వార్డెన్ కు, సిబ్బందికి సూచించారు. మండలంలోని రామారెడ్డి పిహెచ్సి ని పరిశీలించి,. పలు రికార్డులను తనిఖీ చేశారు. రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్వరం, కీళ్ల నొప్పులు అధికంగా ఉన్నాయని తెలిపారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు రాఖీ కట్టారు. గ్రామ సమావేశాలకు భవనం కావాలని మహిళా సంఘాలు కోరగా, ప్రభుత్వ భవనం గ్రామంలో కాళీ ఉంటే మండల స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏసన్న పల్లి ప్రకృతి వనాన్ని పరిశీలించి, ఔషధ మొక్క, పండ్ల మొక్కలు నాటి పెంచాలని సూచించారు. శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఈవో ప్రభు, సిబ్బంది, కలెక్టర్ కు శాలువాతో సన్మానించి, స్వామి వారి జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అందజేశారు. గంగమ్మ వాగు బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రైతు వేదికను సందర్శించి, రుణమాఫీ కానీ రైతు దరఖాస్తుదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక పాఠశాలలో మొక్కలు నాటి నీరు పోశారు.పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఆయన వెంట డి ఆర్ డి ఓ పి డి సురేందర్, డి ఈ ఓ రాజు, మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్, అడిషనల్ పిడి వామన్ రావు, తహసిల్దార్ సువర్ణ, ఎంపీడీవో తిరుపతి రెడ్డి, ఏ పి ఓ ధర్మారెడ్డి, ఏ పీ ఎం ప్రసన్న కుమార్, పంచాయతీ కార్యదర్శులు క్రాంతికుమార్, సత్యవతి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.