సీజనల్ వ్యాధులు రాకుండా స్పెషల్ డ్రైవ్ చేబట్టాలి: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీలలో స్పెషల్ డ్రైవ్  చేపట్టాలని, వన మహోత్సవ కార్యక్రమాలలో వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని,  పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని  జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు ఆయన జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశమై మాట్లాడుతూ మున్సిపల్ వార్డులలో నీరు నిల్వఉండకుండా చూడాలని, గతంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను  గుర్తించి తిరిగి నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని, లార్వాను ప్రారంభ దశలోనే నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని, ఆయిల్ బాల్స్, ఫాగ్గింగ్, ఆంటీ లార్వా స్ప్రేయింగ్ పనులు నిర్వహించాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని, దోమల బాధ కలుగకుండా డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు కృషి చేయాలని, మురికి కాలువలలో పూడికతీత పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ఆదేశించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలకు  కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలలో, రోడ్లకిరువైపులా పెద్ద మొక్కలు నాటాలని, అర్బన్ ప్లాంటింగ్ సంబంధించి మున్సిపల్ వార్డులకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.బెన్ షాలోమ్, కే.గంగాధర్, రెవిన్యూ డివిజనల్ అధికారులు అమరేందర్, శేఖర్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి పద్మజా రాణి, జిల్లా పరిషత్ సిఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి ఎం.ఏ. కృష్ణన్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా పంచాయత్ అధికారి సునంద, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పాపారావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా ఎక్సైజ్ అధికారి సైదులు, పంచాయత్ రాజ్ ఇ.ఇ. వెంకటేశ్వర్లు, జిల్లా మార్కెట్టింగ్ అధికారి సబిత, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.