అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్ళకూడదు: కలెక్టర్

Not to leave office without permission: Collector– అధికారులు అప్రమత్తంగా ఉండాలి…
– కంట్రోల్ రూమ్ నెంబరు 6281492368.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తంగా  ఉండాలి అలాగే అనువది లేకుండా కార్య స్థానం విడిచి వెళితే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు  కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో వర్షపాతం అధికంగా  ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రతి అధికారి తమ విధులు నిర్వహించే కార్య స్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాలలో, మున్సిపాలిటీలలో పురాతన ఇళ్లను గుర్తించి ఇల్లలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.వర్షాల కారణంగా కాలువలపై రోడ్లపై ప్రవాహాలు ప్రవహిస్తున్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామపంచాయతీ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రవాహాలు జరిగే చోట సిబ్బందిని పెట్టాలన్నారు.అలాగే ప్రజలు గుర్తించేలా ఎర్రజెండాలు, డేంజర్ బోర్డు, ఫ్లెక్సీలను వాగులు కల్వర్టుల వద్ద ప్రమాద సూచిక బోర్డులను  పెట్టాలని సూచించారు. చేపల వేటకు వెళ్ళరాదని, అత్యవసర పరిస్థితులలో అందుబాటులో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని మత్యశాఖ ఏడికి ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాత పాఠశాలలు, శిధిలమైన భవనాలు గుర్తించి తాళం వేయాలని డీఈవో అశోక్ ఆదేశించారు. రోడ్లకు ఇరువైపుల ఉన్న చెట్లు వర్షాల వల్ల పడిపోయినట్ల అయితే వెంటనే తొలగించే విధంగా ఆర్ అండ్ బి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. వైద్యశాఖ అధికారులు గ్రామాలలో వేలాడుతున్న కరెంటు వైర్లను సరి చేయాలని అలాగే విద్యుత్ సరఫరా  అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పరిశుద్యం పనులను నిరంతరం పరివేక్షిస్తూ పట్టణాలను గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు ఎప్పుడు గ్రామంలో అందుబాటులో ఉండలాని కమిషనర్లకు పంచాయతీ సెక్రెటరీ ఆదేశించారు. ఏ యన్ యమ్ స్ధాయి నుండి మెడికల్ ఆఫీసర్ వరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలేక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్  రూమ్ నెంబరు 6281492368 కు కాల్ చేయాలని  కలక్టర్ తేలిపారు. వర్షాల కారణంగా జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ వే బెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు.