రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని..నిరాడంబరంగా నిర్వహించాలి : కలెక్టర్‌

నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని కలెక్టర్‌ బీ.ఎం. సంతోష్‌ అన్నారు. గురువారం ఐడీిఓసీి లోని సమావేశపు మందిరంలో రాష్ట్ర ఆవీర్భావ దినోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని సూచించారు.ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్ర మాల్లో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు లేకుండా తమ తమ కార్యాలయాల వద్ద నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఉదయం 8:30 గంటల వరకు పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించుకుని, జిల్లా అధికారులు అందరూ ఉదయం 9:00 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించే పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. తెలంగాణ సంస్కతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ కారులను స్మరించుకోవడం, గౌరవించుకోవడం ముఖ్యమన్నారు. ఈ సమా వేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్‌, ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రామచందర్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయాలి..
రైతులకు నష్టం జరగకుండా నాణ్యతమైన విత్తనాలు ఉత్పత్తి చేయాలని కలెక్టర్‌ బీ.ఎం సంతోష్‌ విత్తన ఉత్పత్తిదారులను ఆదేశించారు. గురువారం ఐ.డీి.ఓ.సీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో విత్తన ఉత్పత్తి దారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లడుతూ రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విత్తన ఉత్పత్తిదారులు రైతులకు మేలు జరిగేలా మంచి విత్తనాలు అందజేయలన్నారు. జిల్లాలో పంటలకు అవసరమైన అనుకూల వాతావరణం ఉన్నందున రైతులకు అహగాహన కల్పించి మేలు రకం విత్తనాలు అందజేయలన్నారు. నాసిరకం విత్తనాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. పంపిణీ అనంతరం రైతులకు అహగాహన కల్పించాలన్నారు. ఎస్‌.ఓ.పీ ఉల్లంగిస్తే చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో డిమాండ్‌కు అనుగుణంగా విత్తనాలు సరఫరా చేయాలని సూచిం చారు. రైతులు నష్టపోకుండా కంపెనీలు నాణ్యమైన విత్తనాలు అందజే యాలని, జిల్లా యంత్రాంగం కంపెనీలకు పూర్తి సహకారం అందించ నున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందనాయక్‌, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకటలక్ష్మి, విత్తన ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువులు, విత్తనాల కొరత సష్టిస్తే చర్యలు తీసుకోవాలి..
ఎరువులు, విత్తనాల కత్రిమ కొరత సష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీ. ఎం. సంతోష్‌ వ్యవసాయ అధికారులను ఆదేశిం చారు. గురువారం ఐ డీి ఓ సీ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో వ్యవసాయ అధికా రులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ ప్రతి దుకాణంలో డీలర్లు తప్పనిసరిగా స్టాక్‌ బోర్డు, అమ్మకాల వివరాలు విధిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాక్‌ బోర్డ్‌ లో సూచించిన వివరాలకు అనుగుణంగా వారి దుకాణంలో స్టాకు ఉందో, లేదో తనిఖీ చేయాలన్నరు. విత్తన డీలర్లు ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మరాదని, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై నిఘా ఉంచాలని, అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. నిబంధనలను పాటించని డీలర్లపై తక్షణ చర్యలు తీసుకున్నప్పుడే మిగతా డీలర్లు సక్రమ ంగా రైతులకు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తారని అన్నారు. జూన్‌ 15 వరకు ప్రతి మండలంలో వ్యవసాయ అధికారులు రోజుకు నాలుగైదు దుకా ణాలు తనిఖీ చేస్తూ రైతులకు సక్రమంగా విత్తనాలు అందేలా చూడా లన్నారు. విత్తనాలు, ఎరువుల కొరత ఉంటే వెంటనే తమ దష్టికి తీసు కొస్తే అవసరం మేరకు.. స్టాకు తెప్పించి, రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమా వేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్‌, మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.