
నవతెలంగాణ – తాడ్వాయి
ఊరట్టం గ్రామ సమీపంలో ఉన్న తూముల వాగు వద్ద కరకట్ట నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్, అధికారులతో కలిసి ముంపు ప్రాంతమైన ఉరట్టం గ్రామాన్ని సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని ఊరటం గ్రామ సమీపంలో ఉండే తూముల వాగు కోతకు గురి అవుతుండడంతో ఈ ప్రాంతంలో సీసీ వాల్ నిర్మించాలని వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న చోట కరకట్ట నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ కార్యనిర్వాహక అధికారి కె నారాయణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రవీందర్, తాడ్వాయి మండల డి ఈ సదయ్య, ఏ ఈ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.