
‘దేశి’ శిక్షణ పొందిన వ్యవసాయ డీలర్లు రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ హనుమంతుకే.జెండగే సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఒక కార్యక్రమంలో వ్యవసాయం, పశుపోషణ, సెరీకల్చర్, సాంకేతిక నైపుణ్యంపై దేశి (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్) శిక్షణ పొందిన 40 మంది డీలర్లకు శిక్షణ సర్టిఫికెట్లను ఆయన అందచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో సాంకేతిక పరిజానం ముఖ్యమన్నారు, మీరు పొందిన శిక్షణతో రైతులకు అవసరమున్న సమాచారాన్ని, సలహాలను అందచేయాలన్నారు. విత్తన, ఎరువుల వినియోగ చట్టాలపై అవగాహన పొందాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏరువాక సైంటిస్ట్ అనిల్, ఆత్మ ఫాసిలేటర్ ఆత్మా రాములు, ఏ.డి.ఏ. లు పద్మావతి, వెంకటేశ్వర్లు, నీలిమ పాల్గొన్నారు.