నాణ్యమైన విద్యాబోధన అందించాలి: కలెక్టర్

To provide quality education: Collector– పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి.
– మూసి ప్రాజెక్టు నీటి నిల్వలు పరిశీలన.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
విద్యార్థులకు మంచి ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం  సూర్యాపేట మండలం లోని మూసి ప్రాజెక్టు ను  కలెక్టర్ సందర్శించి నీటి నిల్వలు, సామర్థతలను పరిశీలించారు.  అదేవిదంగా గేట్ల పనితీరు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పై ప్రాంతాలలో వరదలు పడుచున్నందున ఇరిగేషన్, రెవెన్యూ, పి.ఆర్. అలాగే పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూచించారు.తదుపరి టేకుమట్ల గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాల అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భోజనం, ఆహార పదార్థాలను పరిశీలించారు.  విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి ఆహారంతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందించాలని అలాగే అధ్యాపకులు విదులపట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. వర్షాలు పడుచున్నందున ఎప్పడికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఇరిగేషన్ డి.ఈ  వేణు గోపాల్, ఏ.ఈ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.