
సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి ద్వారా ప్రజలు అందించిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించబడిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి 40 ఫిర్యాదులను స్వీకరించారు. రెవెన్యూ శాఖ 30, మున్సిపాల్ శాఖ 5, విద్యాశాఖ 3, పోలీసు, కార్మిక శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, అమ్మ ఆదర్శ పాఠశాలలకు చెందిన మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి జగన్మోహన్ ప్రసాద్ పాల్గొన్నారు.