భూ సమస్యలపై సత్వరమే స్పందించాలి: కలెక్టర్

– ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలనపై వేగం పెంచండి: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో భూసమస్యల పై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరమంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత తో కలసి పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి రాకుండా సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో జాబ్ కార్డ్ ఉన్న  కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. ప్రజాపాలన సేవ కేంద్రాల లలో   దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదిశగా  ప్రత్యేక అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.అదేవిదంగా జిల్లాలో వచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  స్వీప్ కార్యక్రమాలు నియోజక వర్గాల వారీగా చేపట్టాలని, గత శాసన సభ ఎన్నికల్లో నియమించిన నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు ఎంతో నిబద్ధతతో పని చేసారని వచ్చే లోక్ సభ ఎన్నికలలో అదేతరహ అధికారులు తమకు కేటాయించే విధులు సమర్థవంతంగా చేపట్టాలని అన్నారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ప్రజావాణిలో వివిధ భూ సమస్యలపై 92 దరఖాస్తులు అందాయని అలాగే ఇతర శాఖల నుండి 39 మొత్తం 131 దరఖాస్తులు అందాయని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సి.ఈ. ఓ అప్పారావు, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, డి.పి.ఓ సురేష్ కుమార్, డి.ఏ.ఓ శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.