ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

– ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమం లో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లా ప్రజలకు కొన్ని జాగ్రత్త లు తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ఆరుబయట పని చేసే వారు సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.తరుచుగా నీరు త్రాగుతుండాలి. బయటకి వెళ్ళటప్పుడు నీరు వెంట తీసుకెళ్లాలి,వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ గా ఉంటది కాబట్టినిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఎక్కువ తీసుకోవాలి అని అన్నారు. అలాగే బయటకి వెళ్ళేటప్పుడు ఎండ తగలకుండా టోపీ, రూమాలు ధరించాలి.పలుచని మజ్జిగ, గ్లూకోజ్ నీరు, చిటికెడు ఉప్పు, ఒక్క చాంచ చక్కర ను ఒక గ్లాస్ నీటిలో తీసుకొని ఓ ఆర్ ఎస్ ద్రావణం కలుపు కొని త్రాగితే తక్షణం వడ దెబ్బ నుండి ఉపశమనం కల్గుతుంది అని తెలిపారు. వడ దెబ్బ తగిలిన వారిని చల్లని ప్రదేశం లో గాని నీడలో ఉంచి తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీ లు,చంటి పిల్లలు, వృద్ధులు, ఆనారోగ్యం ఉన్న వారు వడ దెబ్బకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వడ దెబ్బకి గురైన వారు ప్రాధమిక చికిత్స అనంతరం సాధారణ స్థితి కి రాకపోతే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి.జిల్లా కలెక్టరేట్ లలో, ముఖ్యమైన ప్రదేశాలలో టీఎస్ డిపి ద్వారా ఏర్పాటు చేసిన ఎల్ఈడి, వాతావరణ బోర్డు లలో సూచించబడిన కలర్ కోడ్ ల ద్వారా జారీ చేయబడు హెచ్చరికలను తీసుకొవల్సిన జాగ్రత్త లను తప్పనిసరిగా పాటించాలి అని అన్నారు.
అలాగే  ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి..
ఎండలో బయట తిరుగకూడదు బాగా ముదురుగా ఉండే రంగు దుస్తులు ధరించాలి,అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలకి వెళ్ళరాదు ఎండలో ఎక్కువ సేపు పని చేయరాదు.ఒకవేళ పని చేయాల్సి ఉంటే మధ్య మధ్యలో చల్లని ప్రదేశం లో సేద తీరుతు ఉండాలి. నిల్వ ఉన్న ఆహార పదార్దాలు వేడి చేయటం వలన చెడిపోతాయి. వాటిని భుజించరాదు. ఒకవేళ వాటిని తింటే డయేరియా కి గురి అయ్యే ప్రమాదం ఉంది.ఎండలో పార్క్ చేయబడిన వాహనాలలో చిన్న పిల్లలను, వృద్ధులను, ఆరోగ్యం బాగాలేని వారిని ఉంచకూడదు.తలపై రక్షణ (గొడుగు /టోపీ /రుమాలు )లేకుండా ఎండలో ఎక్కువ సేపు ఉండరాదు,వడ దెబ్బ తగిలిన వారిని వేడి నీటిలో తడిపిన గుడ్డ తో తుడవకూడదు,వడ దెబ్బ తగిలిన వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.