
– ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అన్ని చర్యలు
– సోమవారం ఉదయం నుండి యధావిధిగా త్రాగునీటి సరఫరా: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
అవంతిపురం నుండి ఇమాంపేట ప్లాంట్ కు వచ్చే మిషన్ భగీరథ రా వాటర్ పంపింగ్ మెయిన్ ఏం ఎస్ 1200 ఏం ఏం పైపులైన్ గరిడేపల్లి వద్ద లీకేజీ కారణంగా 95 ఏం ఎల్ డి ఇమాంపేట నీటి శుద్ధి కేంద్రం ను నేటి నుండి షట్ డౌన్ తీసుకోవడం ( మరమ్మత్తులు చేయడం కొరకు ) జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్లాంట్ పరిధిలోని సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు అలాగే సంబంధిత మండలాలైన చిలుకూరు లోని (19) గ్రామాలు, కోదాడ(24), అనంతగిరి(24), మునగాల(32), నడిగూడెం(17), పెన్ పహాడ్(52) అలాగే సూర్యాపేట పరిధిలోని 15 గ్రామీణ ఆవాసాలు లాల్య తండా, ఇమాంపేట, రూప్లా తండా, కేటీ అన్నారం, జంగలవారి గూడెం కాసరాబాదు, వెదురువానిగూడెం, జాటోత్ తండా, కేసారం, రాముల తండా, మిట్ట గూడెం, ముత్యాలమ్మ గూడెం, టి కే పహాడ్, బిల్య తండా, రతన్ బోజ్య తండా, 4 విలీన ఆవాసాలు దాసాయి గూడెం, దున్నవారిగూడెం, కుప్పిరెడ్డిగూడెం, కుసుమ వారి గూడెం లకు మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. తదుపరి తేదీ 15.04.2024 సోమవారం ఉదయం పునరుద్ధరించబడుతుందని ఆయా మున్సిపాలిటీలు, గ్రామాల ప్రజలు సహకరించాలని ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోదాడ మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 12 వార్డులకు నీటి ఇబ్బంది ఉంటుందని అలాగే సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను 38 వార్డులలో నీటి ఇబ్బంది ఉంటుందని, వాటర్ ట్యాంక్ ల ద్వారా నీటిని సరఫరా జరుగుతుందని, నీటి ఇబ్బందులు ఉంటే కోదాడ టెక్నీకల్ అధికారి రాజారెడ్డి నెం.8374454641 అలాగే సూర్యాపేట ఏ.ఈ వరుణ్ కుమార్ 6300202057 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.