రాజ్యాంగ దినోత్సవంలో అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్..

Collector pledged with officials on Constitution Day..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం  నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  హనుమంత రావు సమక్షంలో జిల్లా అధికారులు, సిబ్బంది తో ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన – వీటి స్వాతంత్య్రమును, అంతస్తులోనూ, అవకాశంలోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలోనూ వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని’ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టరేట్ వీరారెడ్డి ఏ.ఓ జగన్మోహన్ ప్రసాద్ , వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.