
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం, బీబీనగర్ మండల తాసిల్దార్ కార్యాలయాలను గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ధరణి దరఖాస్తుల పరిష్కార పనులను పరిశీలించారు. పారదర్శకతతో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ధరణి దరఖాస్తులను క్లియర్ చేయాలని, పెండింగ్ లేకుండా క్లియరెన్స్ వేగంగా జరుగాలని తహశీలుదార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో బొమ్మల రామారం తహశీలుదార్ పి శ్రీనివాస్, బీబీనగర్ తహసీల్దార్ మంతపురపు శ్రీధర్, డిప్యూటీ తహశీలుదార్ భగత్ లు ఉన్నారు.