ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..

Collector Yila Tripathiనవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ యిలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు, గదులు, హాస్పిటల్ లో ఉన్న ల్యాబ్ ను,ఓ పి రిజిస్టర్, ను పరిశీలించి , ప్రతి రోజు ఎంతమంది పేషెంట్లు ఆస్పత్రికి వస్తున్నారని సంబంధిత మెడికల్ అదకారిడాక్టర్ నగేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా ఏఏ పేషెంట్లు వస్తున్నారని కలెక్టర్ అడగగా, జలుబు, దగ్గు వచ్చిన వారు వస్తున్నారని మెడికల్ ఆఫీసర్ తెలిపారు మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చూడాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని ఆరా తీశారు.హాస్పటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. ఈ నెల గర్భిణీ స్త్రీలు ఎంతమంది కాన్పు కోసం ఉన్నారో వైద్యాధికారి ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఆసుపత్రులలో ప్రసవాలు గురించి ఆరా తీశారు. ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచుతూ, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని వైద్యాధీకారిని ఆదేశించారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారు. ఇన్ పేషంట్స్ వారి గురించి వాకబు చేశారు. తదుపరి ఫార్మసీ స్టోర్ ఇన్ స్పెక్షన్ చేయడం జరిగింది.అత్యవసర మందుల నిల్వలు సరిగా మైంటైన్ చేయాలని, అలాగే కుక్క కాటు, పాము కాటు, మందులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని ఫార్మసిస్ట్‌ను ఆదేశించారు.అలాగే మండల కేంద్రం లోని నూతనంగా నిర్మాణం చేపడుతున్న హాస్పిటల్ ను పరిశీలించి నెలరోజుల్లో పనులు పూర్తి చేయాలని సంబందిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈయన వెంట మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్ సరోజ పావని, ఎంపీడీఓ సుధీర్ కుమార్ సీహెచ్ ఓ శ్రీనివాస్, సూపర్ వైజర్లు జయకుమారి, సువర్ణ కుమారీ, స్టాఫ్ నర్సులు నిర్మల, ఝాన్సీ, ల్యాబ్ అసిస్టెంట్ ఉదయ్, ఫార్మా సిస్టు రంజిత్ ఉన్నారు.