నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు ఆయన జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలను చేపట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్ల పదవీకాలం ఈ నెల 4 తో ముగిసి పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ పంచాయతీరాజ్ భూమన్న, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసరావు, ఇతర ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ ను శాలువా, పూలమాలలతో స్వాగతం పలికారు.