ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

Collector visiting EVM godownనవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా ఈవీఎం గోదాంను సందర్శన చేసారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, గోదాములో భద్రపరచిన  బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన  తీరును సి.సి.టివి ద్వారా తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్ ,ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, నాయబ్ తహసీల్దార్ అనీల్ తదితరులు పాల్గొన్నారు.