ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గవర్నర్ విష్ణు దేవ దత్తత గ్రామం కొండపర్తి ని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ గురువారం సందర్శించి పరిశీలించారు. గ్రామంలో నిర్మిస్తున్న షెడ్లను పరిశీలించారు. (శిక్షణ కేంద్రాలు). పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఏజెన్సీలోని మారుమూల ఆదివాసి గ్రామమైన, తిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతగా, సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఘట్టమైన అడవి ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రం, ఆయా శాఖల సంబంధిత అధికారులు, గ్రామపెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.