
వచ్చే 5 రోజుల్లో జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు 95 శాతం పూర్తి చేస్తామని ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని పోసానిపేట్, గిద్ద వరి కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తో కలిసి పరిశీలించారు. ధాన్యంలో తేమ, తదితర సమస్యలపై రైతులతో మాట్లాడి తెలుసుకొని, భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జితిష్వి పాటిల్ మాట్లాడుతూ… జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాల్లో 46వేల 613 మంది రైతుల నుండి రూ 576 కోట్ల విలువగల, 2.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతు ఖాతాల్లో రూ 5 0 4 కోట్ల జమ చేశామని తెలిపారు. 200 కేంద్రాల్లో పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని. రెండు రోజుల్లో 30 కేంద్రాల్లో, నాలుగు రోజుల్లో 40 కేంద్రాల్లో, నెల చివరినాటికి రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, తహసిల్దార్, ఉపతహసిల్దార్, సీఈఓ బైరయ్య,, రైతులు తదితరులు ఉన్నారు.