– రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి
– రోడ్డు పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – వీర్నపల్లి
మండలంలో ఉన్న సమస్యలు ,అభివృద్ది పనులు త్వరగా పూర్తి అయ్యేలా పరిష్కారం చూపుతానని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. వీర్నపల్లిలో సమస్యలను స్థానికులు ఇటీవల విన్నవించారు. స్థానికుల సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం వీర్నపల్లి మండల కేంద్రానికి చేరుకొని, వాటిని పరిశీలించగా, స్థానికులు పలువురు కలెక్టర్ ను కలిసి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. పలువురు యువకులు తమ లైబ్రరీ కి పుస్తకాలు కావాలని కోరగా, అందజేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ పర్యటనలో ఇంచార్జీ తహసీల్దార్ మారుతిరెడ్డి, సెస్ డైరెక్టర్ మల్లేశం, మాజి ఎంపిటిసి అరుణ్ కుమార్, మాజి సర్పంచ్ పాటి దినకర్ , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, యూత్ మండల అధ్యక్షులు బొంగు తిరుపతి, నాయకులు లక్ష్మన్, రాజు, చంద్ర మౌళి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.