మహిళా సంఘాల లోని మహిళలు ఆర్థికంగా రాణించాలంటే వివిధ రంగాల యూనిట్లను పెట్టుకునేందుకు మహిళలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎం మన్ చౌదరి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో నాటు కోళ్ల పెంపకం మదర్ యూనిట్ సందర్శించారు. మహిళ సంఘాల ను బలోపేతం చేసేందుకు అనేక రకాల యూనిట్ లను ఎందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం హుస్నాబాద్ లో మహిళా సంఘాలు నిర్వహించే క్యాంటీన్ కొరకు మున్సిపల్ కాంప్లెక్స్ విజిట్ చేశారు. హుస్నాబాద్ లో కొత్తగా నిర్మించే ఆసుపత్రి బిల్డింగ్ పనులను పరిశీలించారు. బిల్లింగ్ పనులను నాణ్యత చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అక్కన్నపేట మండలంలోని అంతక పేట గ్రామానికి చెందిన బోయిని రమాదేవికి డైరీ పార్లర్ యూనిట్ కు లక్ష యాభై వేల రూపాయలు చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డిఓ రామ్ మూర్తి , ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, వెటర్నరీ ఎడి వెంకట్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్ రమేష్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు కరుణాకర్, వాసుదేవ్, ఏఎంమ్ శ్రీనివాస్, సీసీలు అశోక్ ,తిరుపతి, శివ, బిక్షపతి, రవీందర్, జితేందర్ మండల సమాఖ్య అధ్యక్షులు వాణి, మమత, వివో ఏ లు శోభ, సంధ్య, మంగాదేవి, అంజలి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.