నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
కలెక్టరేట్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం రోజున కలెక్టరేట్ లో పనిచేస్తున్న స్వీపర్స్ , గార్డెన్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ కార్మికులతో కలిసి గ్రీవెన్స్ డే లో అదరపు కలెక్టర్కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. నెలకు కేవలం రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని కనీస వేతనం రూ.15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పి ఎఫ్, ఈ యస్ ఐ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు రేఖ, బాలయ్య నాయకులు వసంత, సంతోష, గిరి, మమత, సునీత, రేణుక, లక్ష్మి, హేమలత, యాదమ్మ లు పాల్గొన్నారు.