
నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటా కుటుంబ కుల గనన సర్వేలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాచార సేకరణ కార్యక్రమంలో భాగంగా మద్నూర్, డోంగ్లి, మండలాలకు చెందిన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ మద్నూర్ మండల అభివృద్ధి అధికారి రాణి డోంగ్లి మండల తాసిల్దార్ రేణుక చౌహన్ మద్నూర్ ఉమ్మడి మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య ఉమ్మడి మండల ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ ఉమ్మడి మండల ఏపీఎం రవీందర్ పాల్గొని జిల్లా కలెక్టర్ సర్వే నివేదికలపై నిర్వహించిన కాన్ఫరెన్స్ ద్వారా సమాచారాన్ని అందించడం జరిగింది.