రేపు ముత్తారం మండలంలో కలెక్టర్ పర్యటన

నవతెలంగాణ-ముత్తారం:
రేపు గురువారం ముత్తారం మండలంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పర్యటించనున్నారు. ముత్తా రం మండలం పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11.30 గంటల నుంచి 12.30 గంటల వర కు కలెక్టర్ ముత్తారం తహశీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, ఏదైనా సమస్యల పై ప్రజలు దరఖాస్తులు నమోదు చేయాలంటే నేరుగా కలెక్టర్ ను కలవవచ్చని అధికారులు తెలిపారు.