మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ధోత్రే వెంకటేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ లు వేరువేరుగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. పూజార్లు, ఎండోమెంట్ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. పసుపు, కుంకుమ, చిరే, సారే సమర్పించి సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ప్రత్యేక మొక్కలు చెల్లించారు. అనంతరం పూజారులు, ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి, అమ్మవారి ప్రసాదం సమర్పించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, పూజార్లు కొక్కెర రమేష్, వంశి, ఎండోమెంట్ అధికారి జగన్, వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.