కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం

కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం– మెదక్‌ ప్రాంతీయ పర్యవేక్షకులు భీమయ్య
నవతెలంగాణ జోగిపేట
తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని మెదక్‌ ప్రాంతీయ పర్యవేక్షకులు భీమయ్య తెలిపారు. బుధవారం జోగిపేటలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 2024 లో పదవ తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ .1,50,000 రూపాయలు గ్రామాలలో, రూ .2 లక్షల రూపాయలు పట్టణాలలోనీ వారు అర్హులన్నారు. ప్రస్తుతం తెలుగు మీడియం, ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని, 31/8/2024 నాటికి వయస్సు 17 సంవత్సరములు మించరాదన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగల రాన్నరు. పరీక్షా తేదీ ఫిబ్రవరి 4న 10 గంటలకు ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహించబడును అన్నారు. హాల్‌ టికెట్స్‌ 25/1/24 నుండి 3/2/24 వరకు డౌన్లోడ్‌ చేసుకోగలరన్నారు. మరిన్ని వివరాల కోసం మీ సమీప ప్రాంతంలోని ప్రతిభ కళాశాల యందు సంప్రదించగలరని ఆయన కోరారు.
గురుకులాల్లో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో ఐదవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారని ఆయన తెలిపారు. దరఖాస్తులు ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులన్నారు. ఫిబ్రవరి 11న రాత పరీక్ష నిర్వహించి, మెరిట్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. వివరాలకు 180042545678 టోల్‌ ఫ్రీ నెంబర్‌ సంప్రదించాలని ఆయన సూచించారు.